సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:15 IST)

బీఐఎస్‌లో 337 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్

jobs
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వివిధ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 337 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. 
 
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే బీఐఎస్‌లోని ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 19వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం బీఐఎస్ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.