రిలయన్స్ జియోకు పోటీ.. రూ.97 పేరిట కాంబో రిఛార్జ్

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ

airtel
selvi| Last Updated: శనివారం, 15 సెప్టెంబరు 2018 (17:22 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా టెలికాం రంగంలో జియోకి పోటీగా పలు సంస్థలు రకరకాల ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా ఎయిర్‌టెల్ నుండి శుక్రవారం రూ.97 పేరిట కాంబో రీఛార్జి ఆఫర్ మార్కెట్లోకి రాగా, తాజాగా రూ.419 పేరిట మరో ఆఫర్‌ని ప్రకటించింది. ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్‌‍లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 75 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్‌లో ఎలాంటి పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం వుంటుంది. అలాగే, రోజుకి 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు.దీనిపై మరింత చదవండి :