దీపావళి తర్వాత జియో ప్రీ ఫోన్ల బుకింగ్ ప్రారంభం...

రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రె

reliance global call
pnr| Last Updated: సోమవారం, 16 అక్టోబరు 2017 (12:34 IST)
రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు జియో సిద్ధమవుతోంది.

దీపావళి తర్వాత బుకింగ్స్ ప్రారంభించనుందనే వార్తలు వినొస్తున్నాయి. ఆగస్టు 24వ తేదీన తొలి దశ ఫోన్ బుకింగ్ ప్రారంభం కాగా, అనూహ్య స్పందన రావడంతో మూడు రోజులకే బుకింగ్స్ నిలిపివేసింది. అప్పటికే 60 లక్షల మంది ఫోన్లను బుక్ చేసుకున్నారు.

రెండుసార్లు వాయిదా పడిన అనంతరం నవరాత్రుల నుంచి ఫోన్ల పంపిణీ ప్రారంభించారు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లో ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. జియో ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు రియలన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.దీనిపై మరింత చదవండి :