మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (16:16 IST)

ఎల్జీ నుంచి మడతపెట్టే టీవీ... ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు...

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ ఎల్జీ సరికొత్త టెక్నాలజీతో అత్యాధునిక ఫీచర్లతో ఫోల్డబుల్ (మడతపెట్టే) టీవీని తయారు చేసింది. దీన్ని ఈనెల 8వ తేదీన లాస్‌వెగాస్‌లో ప్రారంభమైన ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల ప్రదర్శనలో ఉంచింది.
 
64 అంగుళాల (165 సెంటీమీటర్లు) 4కే సిగ్నేచర్ ఓఎల్‌డీ స్మార్ట్ టీవీ. దీన్ని మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఈ టీవీని చూసిన సందర్శకులు, నిర్వాహకులు అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ యేడాది ఆఖరు నాటికి ఈ టీవీని మార్కెట్‌లోకి తీసుకునిరానున్నారు. 
 
ఈ టీవీ తయారీలో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా పర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్టుతో పాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ అమర్చడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. అలాగే, సూపర్ హైడెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్ఈడీ టీవీని కూడా ఈ ప్రదర్శనలో ఎల్.జిఉంచడం గమనార్హం. అయితే, ఈ టీవీ ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.