ఒకే యువతిని ముగ్గురు వ్యక్తులతో పెళ్లి ఖాయం చేశాడు..
కమిషన్‌కు ఆశపడి ఒకే యువతిని ముగ్గురు వ్యక్తులకు పెళ్లి సంబంధం ఖాయం చేసిన బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన ఆత్తూరుకు చెందిన తాండవరాయపురానికి చెందిన శక్తి వేల్ అనే వ్యక్తి వధువు కోసం వెతుకులాట ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో బ్రోకర్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించాడు. అతడు కేరళలో తనకు తెలిసిన అమ్మాయి వుందని.. ఆమె పేరు రమ్య అంటూ నమ్మించాడు. ఇంకా ఆ అమ్మాయి ఫోటోను కూడా చూపించాడు.
ఫోటో చూసిన వెంటనే శక్తివేల్‌కు ఆ అమ్మాయి నచ్చడంతో.. ఇక నిశ్చితార్థం చేయాలని చెప్పేశాడు. ఈ క్రమంలో రమ్యకు, శక్తివేల్‌కు రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్‌మెంట్‌లో భాగంగా రమ్యకు శక్తివేల్ ఉంగరాన్ని తొడిగాడు. ఇక బ్రోకర్‌కు రూ.25వేలు ఇచ్చాడు. ఆపై బ్రోకర్ కన్నన్.. శక్తివేల్ మాట్లాడటాన్ని బొత్తిగా మానేశాడు.
శక్తివేల్ తరహాలోనే సేలంకు చెందిన మరో ఇద్దరు యువకులకు రమ్యనే వివాహం చేసేలా పెళ్లి సంబంధాలు ఖాయం చేశాడు. వారి వద్ద కూడా చెరో రూ.25వేల చొప్పున డబ్బు గుంజేశాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న ఆ ముగ్గురు యువకులు.. కుమార్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఈ ఘటనపై పోలీసులకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు రమ్య, బ్రోకర్‌లను అదుపులోకి తీసుకున్నారు.