ఉద్యోగులపై వేటు వేయనున్న మైక్రోసాఫ్ట్?
మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2,20,000 మందికి పైగా ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. చివరి త్రైమాసికం ఆదాయాన్ని వెల్లడించడానికి వారం రోజుల ముందు మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది.
ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులకు నేటి నుంచే లేఆఫ్‌లు ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మైక్రోసాఫ్ట్ కొట్టిపారేసింది. కఠిన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.