ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (16:38 IST)

వందేళ్ల అరుదైన రాబందును పట్టుకున్నారు..

Bird
కాన్పూర్ స్థానికులు వందేళ్ల అరుదైన హిమాలయాకు చెందిన రాబందును రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం బెనజబర్ ఈద్గా శ్మశానవాటిక సమీపంలో హిమాలయన్ రాబందును రక్షించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. 
 
వారం రోజుల క్రితమే రాబందును చూశామని, అయితే పట్టుకోలేకపోయామని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. 
 
అధికారులు దానిని అలెన్ ఫారెస్ట్ జూకు తరలించి 15 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. రాబందు సుమారు 8 కిలోల బరువు ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు.