శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (15:09 IST)

కాలగర్భంలో కలిసిపోనున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌

Internet Explorer
వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. మెక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్‌ది ప్రత్యేక స్థానమని అందరికీ తెలిసిందే. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘటన ఈ ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్‌కే చెందుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వెబ్ బ్రౌజర్ కాలగర్భంలో కలిసిపోనుంది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌ సేవలు భవిష్యత్తులో దీనిని సపోర్ట్‌ చేయవని వెల్లడించింది.
 
2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11ను సపోర్టు చేయవని.. ఈ ఏడాది నవంబర్‌ 30 తర్వాత నుంచి తమ టీమ్‌ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఇక ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్‌కు కూడా వచ్చే మార్చి 9 నుంచి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపింది.