గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (11:56 IST)

జనవరి 9న మోటరోలా నుంచి Moto G34 5G.. ఫీచర్స్ ఇవే

Moto G34 5G
Moto G34 5G
మోటరోలా భారతదేశంలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీని పేరు Moto G34. ఇది 5G స్మార్ట్‌ఫోన్. Moto G34 5G జనవరి 9న భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఈ మోటో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే చైనాలో విడుదలైంది. 
 
భారత్‌లో విడుదల చేయనున్న ఈ గాడ్జెట్ ఫీచర్లు చైనా మోడల్‌ను పోలి ఉన్నాయి. Moto G34లో Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ ఉంది. 8GB RAM-124GB స్టోరేజ్ సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 8GB వర్చువల్ ర్యామ్, మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉండటం విశేషం.
 
Moto G34 5G గాడ్జెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జర్ ఉంది. Motorola కొత్త గాడ్జెట్ 50MP ప్రైమరీ, 2MP మాక్రో లెన్స్ సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా వస్తోంది.

ఇది Android 14 ఆధారిత MYUI 6.0 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. Moto G34 స్మార్ట్‌ఫోన్ స్టార్ బ్లాక్, సీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. చైనాలో ఈ మొబైల్ ధర 999 యువాన్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.12 వేలు. 
 
అయితే, భారతదేశంలో, 4GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 ఉండవచ్చు. 8GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిపై బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.