భారత్‌లో నోకియా 2 స్మార్ట్ ఫోన్ ... ధర రూ.7500

మొబైల్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం నోకియా తాజాగా తయారు చేసిన నోకియా 2 ఫోన్ భారతీయ మొబైల్ మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. నోకియా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫోన్లంటిలోకెల్లా తక్కువ ధరతో ఈ ఫోన్‌ను విడుదల

nokia smart phone
pnr| Last Updated: శనివారం, 4 నవంబరు 2017 (10:44 IST)
మొబైల్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం నోకియా తాజాగా తయారు చేసిన నోకియా 2 ఫోన్ భారతీయ మొబైల్ మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. నోకియా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫోన్లంటిలోకెల్లా తక్కువ ధరతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ ఏ4100ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది పనిచేయనుంది. అంటే, ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఈ ఫోన్ స్పెషాలిటీ. ఈ ఫోన్ ధర రూ.7500గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లోని ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే...

4జీ వీవోఎల్టీఈ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్స్, ఆండ్రాయిడ్ 7.1 నోగట్, 1జీవీ ర్యామ్, 8 జీవీ ఇన్‌బిల్ట్, 128 జీబీ మెమరీ కార్డు, 5 అంగుళాల టచ్ స్క్రీన్, హెచ్‌డీ క్వాలిటీ, గొర్రిల్లా గ్లాస్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 212 ప్రాసెసర్. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా (ఆటోఫోకస్ - లెడ్ ఫ్లాష్), 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ మరో పది రోజుల్లో అన్ని షోరూంలలో అందుబాటులోకి వస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :