శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (11:47 IST)

60 ఏళ్లలో తొలిసారిగా కొత్త లోగో మార్చిన నోకియా

Nokia
Nokia
నోకియా 60 ఏళ్లలో తొలిసారిగా తన బ్రాండ్ గుర్తింపును కొత్త లోగోను ఆవిష్కరించింది. 5జీ టెక్నాలజీ ఫిన్నిష్ తయారీదారు Nokia Oyj దాని చిహ్నాన్ని మార్చింది. 
 
కానీ నోకియా అంటే మొబైల్ ఫోన్ బ్రాండ్ అనే కాదు.. ఈ రోజుల్లో వ్యాపార సాంకేతిక సంస్థ ఎదుగాలని అనుకుంటున్నామని నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్ మార్క్ తెలిపారు. 
 
నోకియా ప్రైవేట్ 5జీ నెట్ వర్క్ లతో వ్యాపారాలను అందించే తన వ్యాపార విస్తరణను వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు మార్క్ చెప్పారు. 
 
అందుకే నోకియా లోగో కొత్తగా ఉండాలని దీనిని ఆవిష్కరించారు. కాగా 2014లో కంపెనీని కొనుగోలు చేసిన మైక్రోస్టాఫ్ కార్పొరేషన్ పేరు ఉపయోగించడం మానేసింది.