సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (15:13 IST)

వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదు..

Oppo Reno5 A
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదని జర్మనీలో నిషేదాలు విధించారు. నోకియా కంపెనీ పేటెంట్‌ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్‌ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌పై జర్మనీలో నిషేధం విధించింది.
 
స్థానిక కోర్పు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వన్ ప్లస్, ఒప్పో తమ ఉత్పత్తులను జర్మనీలో ఇక అమ్మలేవని తెలిపింది. యూరప్‌ వ్యాప్తంగా నోకియా హక్కుదారు కావడం గమనార్హం. 
 
నోకియా సుమారు 129 బిలియన్‌ యూరోల పెట్టుబడితో 5జీ నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్‌ చేసే టెక్నాలజీ పేటెంట్‌ హక్కులు పొందింది. అలాంటి నోకియాతో ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు ఒప్పందం చేసుకోకుండా, లైసెన్స్‌ తీసుకోకుండా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ నోకియా కంపెనీ 2021, జులైలో ఆసియా, యూరప్‌లోని పలు దేశాల్లో కేసు నమోదు చేసింది. 
 
ఒప్పో కంపెనీ.. నోకియాతో 2018 నవంబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ 2021 జూన్‌తో ముగిసిపోనుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒప్పో ఈ లైసెన్స్‌ను పునరుద్ధరించకపోగా, రెన్యూవల్ ఆఫర్‌ను కూడా ఒప్పో తిరస్కరించినట్లు నోకియా ఆరోపిస్తోందని సమాచారం.