శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (23:00 IST)

షూటింగ్ వరల్డ్ కప్‌లో అదుర్స్.. 10 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం

arjun babuta
arjun babuta
అర్జున్ బూట షూటింగ్ వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ కొజెనెస్కీపై గెలుపొంది బంగారు పతకాన్ని ముద్దాడాడు. 
 
ఉత్కంఠగ సాగిన ఫైనల్లో 17-9తో కొజెనెస్కీని అర్జున్ ఖంగుతినిపించాడు. ఈ టోర్నీలో భారత్కు ఇదే తొలి పతకం. అటు సీనియర్ లెవల్ టోర్నీల్లో అర్జున్ బబూటకు ఫస్ట్ గోల్డ్ మెడల్. 2016లో అజర్ బైజాన్ వేదికగా జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో  అర్జున్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 
 
అంతకుముందు జరిగిన రౌండ్లో అర్జున్ 261.1 పాయింట్లు సాధించి ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు.  260.4 పాయింట్లతో  కొజెనెస్కీ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఫైనల్లో 17-9 స్కోరుతో  అర్జున్ విజయం సాధించాడు.