గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2024 (23:09 IST)

భారతదేశంలో నథింగ్ ఫోన్ (2a) విక్రయాలు

Nothing Phone (2a) Plus
లండన్‌కు చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, తమ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్ విక్రయాల ప్రారంభాన్ని ప్రకటించింది, భారతదేశంలో 07వ తేదీ ఆగస్ట్ (మధ్యాహ్నం 12 గంటలు) నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంతగానో అంచనాలు వేయబడిన ఈ డివైజ్ ఫోన్ (2ఎ) విజయంపై రూపొందింది, ఫోన్ పెర్ఫార్మెన్స్, కెమేరా సామర్థ్యాలు, డిజైన్‌ను మెరుగుపరిచింది.
 
ఫోన్ (2ఎ) ప్లస్ ప్రత్యేకమైన మీడియా టెడ్ డైమన్సిటి 7350 ప్రో 5జి ప్రాసెసర్ ద్వారా మద్దతు చేయబడింది. సాఫీ, వేగవంతమైన యూజర్ అనుభవం నిర్థారిస్తోంది. స్మార్ట్ ఫోన్ TSMC 4 nm Gen 2 టెక్నాలజీ, ARM Mali-G610 MC4 GPU, నథింగ్ స్మార్ట్ క్లీన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ కలయిక ఈ ఫోన్ కంటే ముందు వచ్చిన ఫోన్ కంటే సుమారు 10% వేగవంతమైన CPU పెర్ఫార్మెన్స్‌ను, 30% ఎక్కువ వేగవంతమైన గేమింగ్ సామర్థ్యాలను  అందిస్తుంది. కొత్త 50 MP ఫ్రంట్ కెమేరా కొత్త స్థాయిలకు సెల్ఫీలను తీసుకువెళ్తుంది, ఇప్పుడు ఉన్నతమైన 4K వీడియోను ఫోన్ (2ఎ) యొక్క 32 MP సెన్సర్ నుండి హార్డ్ వేర్ అప్ గ్రేడ్ 30 FPS వద్ద కూడా కాప్చర్ చేస్తుంది.
 
ఉన్నతమైన వివరణలను ప్రతిబింబించడానికి డివైజ్‌లో రెండు కొత్త మెటాలిక్ కలర్ వేస్ అభివృద్ధి చేయబడ్డాయి. 1300 నిట్స్‌తో దీని 6.7” FHD+ AMOLED డిస్ప్లే, 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేటు సాఫీ ఇంటరాక్షన్స్, అద్భుతమైన విజువల్స్‌ను నిర్థారిస్తాయి. డివైజ్ ఈ రోజుకు నథింగ్ వారి అతి పెద్ద స్మార్ట్ ఫోన్ బ్యాటరీని కలిగి ఉంది. శక్తివంతమైన 5,000 mAh యూనిట్, పూర్తి ఛార్జీపై రెండు రోజుల వాడకం వరకు అందిస్తుంది. అదనంగా, ఫోన్ వేగవంతమైన 50W వేగవంతమైన ఛార్జింగ్‌ను కలిగి ఉంది, 20 నిముషాల లోగా పూర్తి రోజంతా పవర్ ను చేరుకోవడానికి అనుమతి ఇస్తోంది, ఇది ఈ ఫోన్ కంటే ముందు వచ్చిన ఫోన్ కంటే సుమారు 10% వేగవంతమైనది.
 
ముఖ్యంగా, ఫోన్ (2ఎ) ప్లస్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వచ్చింది. ఇది మూడేళ్ల వరకు సాఫ్ట్వేర్ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వాగ్దానం చేసింది. ఫోన్ (2ఎ) ప్లస్ నథింగ్ OS 2.6తో లభిస్తోంది, కొత్త ఫంక్షనల్ విడ్గెట్స్‌ను, న్యూస్ రిపోర్టర్ విడ్గెట్ వంటి ఏఐ-పవర్ ఫీచర్లు అందిస్తోంది.
 
ధర మరియు లభ్యత
ఫోన్ (2ఎ) ప్లస్ గ్రే, నలుపు మొబైల్స్‌తో లభిస్తోంది, ఈ రెండు మోడల్స్ నుండి ప్రజలు ఎంచుకోవచ్చు. 256 GB స్టోరేజ్ వేరియెంట్‌తో 8GB RAM రూ.27,999 ధరకు లభిస్తోంది, కానీ విడుదల సందర్భంగా ఇది ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా రూ.2,000 డిస్కౌంట్‌తో రూ. 25,999కి అందచేయబడుతోంది. 256GB స్టోరేజ్ వేరియెంట్‌తో 12GB RAM రూ.29,999కి లభిస్తోంది అయితే ప్రత్యేకమైన విడుదల సందర్భంగా బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ రూ. 2,000 సహా ధర రూ. 27,999కి లభిస్తుంది. ఫోన్ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్, ఇతర రీటైల్ భాగస్వాముల వద్ద  లభిస్తోంది.