1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (16:04 IST)

నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురుచూపులు - యాక్షన్ బటన్‌తో వస్తుందా?

Nothing Phone 3
Nothing Phone 3
నథింగ్ ఫోన్ 2 సక్సెస్ తర్వాత, రాబోయే నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయి. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ, నథింగ్ సీఈఓ, కార్ల్ పీ కొత్త ఫోన్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇటీవల, కార్ల్ పీ సోషల్ మీడియాలో ఈ ఫోనుకు సంబంధించిన తాజా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు. ఈ ఫోన్ కుడి వైపున ఒక కొత్త బటన్‌ను గుర్తించారు నెటిజన్లు. 
 
ఇది "యాక్షన్ బటన్"ను పోలి ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ అనే కొత్త బటన్ షార్ట్ కట్ కీ వలె ఉపయోగపడుతుంది. ఇకపోతే.. నథింగ్ ఫోన్ 3 కోసం స్మార్ట్ ఫోన్ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.