శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (21:12 IST)

లోన్ కావాలా? ఫేస్ చూస్తే ఇచ్చేస్తారట..!

Facial and Voice Recognition app
లోన్ కావాలా? అయితే డాక్యుమెంట్లు ఇవ్వనక్కర్లేదు. ఇక్కడ మాత్రం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కస్టమర్‌కు లోన్ ఇవ్వాలా? వద్దా? అని ఒక యాప్ 2 నిమిషాల్లో డిసైడ్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. టోక్యోకు చెందిన డీప్‌స్కోర్ అనే కంపెనీ ఫేసియల్ అండ్ వాయిస్ రికగ్నిషన్ యాప్‌ ఇందులో కస్టమర్ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 
 
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ AI కస్టమర్ ముఖం, మాటలను విశ్లేషించి స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ ప్రాతిపదికన బ్యాంకులు, కంపెనీలు రుణాన్ని ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయిస్తాయి. 10 ప్రశ్నల ద్వారా కస్టమర్లు నిజం చెబుతున్నారా? లేదా? అని ముఖ కదలికలు, మాటల ద్వారా ఏఐ పసిగట్టేస్తుంది. ఈ టెక్నాలజీపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కస్టమర్లు బాధ లేదా సంతోషంలో ఉంటే ముఖ కదలికలు, మాటలు మారిపోవచ్చని, దీని వల్ల అర్హత కలిగిన వారికి కూడా రుణం లభించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.