గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (14:15 IST)

ఐఫోన్‌ 13కు ఆర్డర్‌ చేస్తే.. ఐఫోన్‌-14 వచ్చింది..

iPhone 14
iPhone 14
ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రస్తుతం అగ్గిపుల్ల నుంచి సబ్బు పెట్టె వరకు ఆర్డర్ చేస్తే ఇంటికి పంపించేస్తున్నాయి. ఆన్‌లైన్ లో దొరకని వస్తువంటూ లేదు. అయితే ఒక్కోసారి ప్యాకింగ్ పొరపాటు కారణంగా ఆర్డర్ చేసిన పెట్టెల్లో ఇటుకలు, సబ్బులు వచ్చిన ఘటనలున్నాయి. 
 
అయితే తాజాగా ఓ కస్టమర్‌కి అదృష్టం కలిసివచ్చిందనే చెప్పాలి. ఐఫోన్‌-13కు ఆర్డర్‌ చేస్తే.. ఐఫోన్‌ 14ను ఫ్లిఫ్ కార్ట్ పంపింది. వివరాల్లోకి వెళితే. అశ్విన్‌ హెగ్డే అనే యూజర్‌ దీనికి సంబంధించి.. ఫోన్‌ బుక్‌ చేసిన ఆర్డర్‌ స్క్రీన్‌ షాట్‌, ఐఫోన్‌ 14 అందిన బాక్స్‌ చిత్రాలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  
 
స్క్రీన్‌ షాట్‌ ప్రకారం చూస్తే.. సదరు వినియోగదారుడు నీలి రంగులో, 128 జీబీ మెమరీ ఉన్న ఐఫోన్‌ 13ను బుక్‌ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఐఫోన్-14 వచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. "ఆయనెవరో చాలా అదృష్టవంతుడు.. కోరిన దానికన్నా పెద్దదే వచ్చింది", "ఇది వంద శాతం లక్" అని కొందరు అంటున్నారు.