శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 ఏప్రియల్ 2021 (20:31 IST)

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఫ్లాష్‌ చార్జ్‌తో అతి పలుచటి స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌ 19ను విడుల చేసిన ఒప్పో

సుప్రసిద్ధ అంతర్జాతీయ స్మార్ట్‌ డివైజ్‌ బ్రాండ్‌ ఒప్పో మరోమారు తమ ఎఫ్‌ సిరీస్‌ కింద అతి పలుచటి స్మార్ట్‌ఫోన్‌ నూతన ఒప్పో ఎఫ్‌ 19 ను భారతదేశంలో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఒప్పో ఎఫ్‌ 19 తనతో పాటుగా 33 వాట్‌ ఫ్లాష్‌ చార్జ్‌ను కలిగి ఉండటంతో పాటుగా తేలికపాటి, పలుచటి డిజైన్‌ కలిగిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని సైతం కలిగి ఉంది. కేవలం 5 నిమిషాల చార్జింగ్‌తో ఇది 5.5 గంటల టాక్‌టైమ్‌ అందిస్తుంది.
 
యువతను లక్ష్యంగా చేసుకున్న ఒప్పో ఎఫ్‌ 19 తనతో పాటుగా 33 వాట్‌ ఫ్లాష్‌ చార్జ్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అమోలెడ్‌ ఎఫ్‌హెచ్‌డీ +డిస్‌ప్లే, ఇన్‌స్ర్కీన్‌ ఫింగర్‌ఫ్రింట్‌, తాజా కలర్‌ ఓఎస్‌ 11.1 వంటివి తీసుకువచ్చింది.
 
ఆవిష్కరణ సందర్భంగా దమయంత్‌ సింగ్‌ ఖనోరియా, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఒప్పో మాట్లాడుతూ, ‘‘మరింత మంది వినియోగదారులకు ఆకర్షణీయమైన సాంకేతికతను తీసుకువచ్చేందుకు ఒప్పో కట్టుబడి ఉంది. ప్రతి ఒక్కరికీ అనువైన సాంకేతికతను ఎఫ్‌ సిరీస్‌ అందిస్తుంది. అది సాంకేతికత పరంగా మాత్రమే కాదు, ఆకర్షణీయమైన సన్నిటి డిజైన్‌ లేదా రోజువారీ అవసరాలకు తగినట్లుగా అయినా సరే వినూత్నతను అందిస్తుంది. ఈ ఫోన్‌ గత తరాలతో పోలిస్తే మెరుగైన డిజైన్‌, అత్యుత్తమ స్ర్కీన్‌ను అందిస్తుంది’’ అని అన్నారు.
 
‘‘ఎఫ్‌ సీరిస్‌ వారసత్వం భారతదేశంలో మహోన్నతంగా చాటుతుంది. ఇప్పటివరకూ 10మిలియన్‌లకు పైగా ఎఫ్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఇక్కడ విక్రయించబడ్డాయి. రిలయన్స్‌ డిజిటల్‌, టాటా క్రోమా లాంటి రిటైల్‌ భాగస్వాములు ఈ మైలురాయి చేరుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు..’’ అని అన్నారు.
 
ఒప్పో ఎఫ్‌ 19 రెండు రంగులు- ప్రిజమ్‌ బ్లాక్‌, మిడ్‌నైట్‌ బ్లూలలో లభ్యమవుతుంది. ఒప్పో ఎఫ్‌ 19 6జీబీ రామ్‌+128 జీబీ స్టోరేజీతో 18,990 రూపాయల ధరలో భారతదేశ వ్యాప్తంగా ప్రధాన స్రవంతి రిటైలర్లు, ఈ-కామర్స్‌ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. వీటితో పాటుగా ఆఫ్‌లైన్‌ రాయితీలు, బ్యాంకు కార్డులపై క్యాష్‌బ్యాక్‌ లు, సులభమైన ఈఎంఐ అవకాశాలు సైతం పొందవచ్చు.