శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:55 IST)

రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫస్ట్‌సేల్‌, ధరల వివరాలు.. ఫీచర్స్ ఇవే

Realme 8 5G
తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గత నెలలో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రొలను భారత్‌లో లాంచ్‌ చేసిన కంపెనీ ఇప్పుడు రియల్‌మీ 8 సిరీస్‌లో 5జీ వేరియంట్‌ను విడుదల చేసింది. 
 
8 5జీ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీ ర్యామ్‌, 48 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుంది. సూపర్‌సోనిక్‌ బ్లాక్‌, సూపర్‌సోనిక్‌ బ్లూ కలర్‌ఆప్షన్లలో లభించనుంది. ఫస్ట్‌సేల్‌ ఏప్రిల్‌ 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ డాట్‌కామ్‌ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
 
రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో రిలీజ్ అయింది. రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో నైట్‌స్కేప్, 48ఎం మోడ్, ప్రో మోడ్, ఏఐ స్కాన్, సూపర్ మ్యాక్రో లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్ కెమెరాలో కూడా పోర్ట్‌రైట్, నైట్‌స్కేప్, టైమ్‌ల్యాప్స్ ఫీచర్స్ ఉన్నాయి. 
 
రియల్‌మీ 8 5జీ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది:
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ .14,999
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ .16,999