చైనాలో రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌ లాంచ్.. ప్రత్యేకతలు..

మోహన్| Last Updated: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:26 IST)
స్మార్ట్‌ఫోన్‌ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న షావోమీ సంస్థ చైనాలో రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో‌ను ఆవిష్కరించింది. కాగా తక్కువ ధరకే ఈ ఫోన్‌లను ప్రకటించడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ధర 999 యువాన్లు (రూ.10,000) కాగా, రెడ్‌మీ నోట్ 8 ప్రో 1,399 యువాన్లు (రూ.14,000) మాత్రమే.

ఈ రెండు ఫోన్‌లు క్వాడ్(నాలుగు) కెమెరాలను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు కావడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీడబ్ల్యూ1 సెన్సార్ ఉంది. ప్రస్తుతం షావోమీ సంస్థ ఈ ఫోన్లను చైనాలో మాత్రమే ప్రకటించింది.

రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దసరా, దీపావళి పండుగల సమయానికి భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 8 ప్రో ప్రత్యేకతలు..
* 6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
* 8 జీబీ ర్యామ్,
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
* మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్,

* 64+8+2+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు,
* 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,

* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
* ఆండ్రాయిడ్ 9 పై+ఎంఐయూఐ 10దీనిపై మరింత చదవండి :