గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (13:09 IST)

శామ్‌సంగ్ ఉపాధ్యక్షుడికి 12ఏళ్ల జైలు శిక్ష విధించమంటే.. ఐదేళ్లు ఖరారు చేశారు..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఉపాధ్యక్షుడు హెర్ లీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవినీతి కేసులో ఆయనకు దక్షిణ కొరియా న్యాయస్థానం శుక్రవారం ఈ శిక్ష విధించింది. ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి లీ

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఉపాధ్యక్షుడు హెర్ లీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవినీతి కేసులో ఆయనకు దక్షిణ కొరియా న్యాయస్థానం శుక్రవారం ఈ శిక్ష విధించింది. ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి లీ జే యాంగ్‌ లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో ఆయన ఈ కేసులో చిక్కుకున్నారు. దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ చైర్మన్‌ లీ లంచం ఇచ్చారని కోర్టు తేల్చింది. 
 
శాంసంగ్‌ సీ అండ్‌ టీ, కెయిల్‌ ఇండస్ట్రీస్‌ వివాస్పద విలీనానిని సంబంధించి 2015లో ప్రభుత్వ ఆమోదం కోసం ఈ లంచం ఇచ్చారనే ఆరోపణతో ఆయనకు జైలుశిక్ష విధించారు. ఇంకా అత్యంత ధనవంతుడిగా పేరొందిన లీపై అవినీతి, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ని ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా లీకు 12ఏళ్ల జైలు శిక్ష విధించాల్సిందిగా ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు. కానీ కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే ఖరారు చేసింది.