మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (11:21 IST)

బెంగుళూరులో స్వేచ్ఛగా విహరిస్తున్న శశికళ... ఇదిగో వీడియో : డీఐజీ డి.రూప

కర్ణాటక రాష్ట్ర డీఐజీ పోలీసు అధికారిణి డి.రూప మరో సంచలన ఆరోపణ చేశారు. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అధికారిణిగా పని చేసిన సమయంలో అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ జైలులో అనుభవిస

కర్ణాటక రాష్ట్ర డీఐజీ పోలీసు అధికారిణి డి.రూప మరో సంచలన ఆరోపణ చేశారు. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అధికారిణిగా పని చేసిన సమయంలో అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ జైలులో అనుభవిస్తున్న రాణిభోగాలపై రహస్య వీడియోను బహిర్గతం చేసి సంచనం సృష్టించింది. దీంతో డి.రూపపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటువేసింది. జైళ్ళ శాఖ నుంచి ట్రాఫిక్ పోలీసు విభాగానికి బదిలీ చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె ఆ రాష్ట్ర తాజాగా నివేదికతో పాటు.. వీడియోను క్లిప్పింగ్స్‌ను అందజేశారు. ఇందులో శశికళకు సంబంధించిన వీడియో ఉండటం గమనార్హం. ఇందులో శశికళ సివిల్ దుస్తుల్లో జైలు బయటకెళ్లి, ఇద్దరు గార్డుల సెక్యూరిటీతో వస్తున్న సీసీటీవీ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి.. మళ్లీ తిరిగి లోపలికి వచ్చే దృశ్యాలను రూప బయటపెట్టారు. ఈ దృశ్యాలను కర్ణాటక ఏసీబీ అధికారులకు రూప అందజేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.