సోనీ నుంచి కొత్తగా సోనీ 10, 10 ప్లస్‌.. తెలుసుకుంటే కదా...

sony mobile
మోహన్| Last Modified మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:34 IST)
మొబైల్ తయారీ సంస్థ సోనీ 2019లో మూడు ఫోన్‌లతో ఎక్స్‌పీరియాను సరికొత్తగా డిజైన్ చేసింది. ఎక్స్‌పీరియా 1తో పాటుగా మధ్య స్థాయి ఎక్స్‌పీరియా 10, 10 ప్లస్‌ను లాంచ్ చేయనుంది. సోనీ సంస్థ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో వీటిని ప్రదర్శించింది. సాధారణంగా ఇప్పుడు వస్తున్న ఫోన్‌లలో యాస్పెక్ట్ రేషియో 18:9 లేదా 19:5 ఉండగా, వాటితో పోటీలో వెనుకబడకుండా ఉండేందుకు సోనీ మాత్రం 21:9 స్క్రీన్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన 21:9 మల్టీ విండో మోడ్‌లో వినియోగదారులు ఒకే స్క్రీన్‌పై రెండు యాప్‌లను ఒకేసారిగా ఉపయోగించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ మరియు జీమెయిల్ వంటి వాటిని సైతం ఫోన్‌లోని మల్టీ విండో మోడ్‌లో ఉపయోగించి పరీక్షించగా, ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. అయితే ఇది పరిమాణంలో పెద్దదిగా ఉండడం వల్ల దీనిని ఒక చేతితో పట్టుకోవడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు.

సోనీ 10, 10 ప్లస్ ప్రత్యేకతలు:
ఎక్స్‌పీరియా 1 మరియు 10 ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయి.
ఎక్స్‌పీరియా 10లో 13MP+5MP బ్యాక్ కెమెరా ఉండగా, 2,870mAh బ్యాటరీ ఉంటుంది.
ఎక్స్‌పీరియా 10 ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌తో పాటు 12MP+8MP బ్యాక్ కెమెరాలు ఉంటాయి, అలాగే 3,000mAh బ్యాటరీ ఉంటుంది.
రెండు ఫోన్‌లలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.దీనిపై మరింత చదవండి :