నిద్రలేమి - నిజాలు... ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి...

సిహెచ్| Last Modified గురువారం, 14 ఫిబ్రవరి 2019 (20:16 IST)
నిద్రలేమి లేదా నిద్రలోపాలు మన శరీర జీవక్రియపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాటుగా ఆకలి మరియు శక్తి వంటి వాటిపై కూడా తీవ్రప్రభావం చూపుతుంది. ఇవన్ని కారణాలు శరీర బరువు నిర్వహణలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి మన శరీర బరువును ఎలా ప్రభావిత పరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిద్రలేమి మరియు బరువు పెరగటం వంటి విషయాల గురించి మాట్లాడినపుడు మొదటగా వినబడే విషయం హార్మోన్ల అసమతుల్యత. మన ఆకలి రెండు హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది. లెప్టిన్ మరియు గ్రెలిన్. లెప్టిన్ శరీరంలోని ఫ్యాట్ కణాల నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఇది ఆహారం తినటం చాలు అనే సందేశాన్ని మెదడుకు చేరవేస్తుంది.

గ్రెలిన్ అనే హార్మోన్ జీర్ణాశయం నుండి ఉత్పత్తి చేయబడుతుంది మరియు నిరంతరంగా తినాలని మెదడుకు సూచిస్తుంది. రోజులో కొన్ని గంటల పాటూ నిద్రలేని వారిలో 15 శాతం లెప్టిన్ మరియు 15 శాతం గ్రెలిన్ అదనంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఫలితంగా నిద్రలేమి ఉన్న వారు పూర్తి రోజు ఎక్కువగా తింటూ ఉంటారు. సరైన సమయం పాటూ నిద్రపోయే వారు, సరైన మోతాదులో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.

2. మనం తీసుకున్న కేలోరీలలో దాదపు 60 నుండి 65 శాతం వరకు పడుకున్నపుడు కరిగించబడతాయి. మిగిలిన 30 నుండి 35 శాతం కెలోరీలు రోజు మనం చేసే ఇతరపనులలో ఖర్చు చేయబడతాయి. కావున సరైన సమయంలో నిద్రపోయిన వారితో పోలిస్తే తక్కువ సమయం పాటూ నిద్రపోయే వారిలో చాలా తక్కువ కెలోరీలు వినియోగించబడతాయి. ఇలా కొంతకాలం పాటూ నిద్రలేమికి గురైతే బరువు గణనీయంగా పెరుగుతుంది.

3. అలాగే సరైన సమయం పాటూ నిద్రలేకపోవటం వలన కూడా తీవ్రమైన ఒత్తిడికి కారణం అవవచ్చు. సరైన సమయంలో నిద్రలేకపోవటం వలన మెదడు నిరంతరంగా పని చేయటం వలన మెదడుకు విశ్రాంతి ఉండదు. ఇది మన శరీర వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. ఒత్తిడి హార్మోన్లు జీవక్రియను నెమ్మదిపడటానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది.

4. నిద్రలేమి శరీర బరువు పెంచటమే కాదు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వంటి వాటిని కలిగిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి మరియు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండటానికి రోజు 7 నుండి 8 గంటల నిద్ర తప్పని అవసరం. రోజు ఇంత సమయం పాటూ నిద్రపోవటం బరువు కూడా ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది.దీనిపై మరింత చదవండి :