మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (10:54 IST)

త్వరలో హలో మెసేజింగ్ యాప్ నిలిపివేత...

నేటి తరుణంలో ఈ స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో.. వాట్స్‌యాప్, ఫేస్‌బుస్, ఇన్‌స్టాగ్రామ్, యూటూబ్ వంటి యాప్స్ ఉన్నవి చాలక ఇప్పుడు గూగుల్‌ కొత్తగా హలో మెసేజింగ్ యాప్ అని ఓ యాప్‌ను విడుదల చేశారు.
 
హలో యాప్ యూజర్లను హ్యాంగ‌వుట్స్ చాట్, మీట్ యాప్‌లకు అప్‌గ్రేడ్ చేస్తామని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డ్యుయో యథావిధిగా కొనసాగుతుందని గూగుల్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదే ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్‌లకు డ్యూయో వీడియో కాలింగ్ యాప్ సపోర్ట్‌ను అందించారు.

కానీ.. ఈ హలో యాప్‌కి యూజర్ల నుండి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. అందువలన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన అలో మెసేజింగ్ యాప్‌ను వచ్చే ఏడాది మార్చి 2019న ఈ యాప్‌ను నిలిపివేస్తున్నామని వెల్లడించింది.