వాట్సాప్: వీడియోలను స్టిక్కర్లుగా మార్చి పంపితే ఎలా వుంటుంది..?
వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌లో స్టిక్కర్‌కు సంబంధించిన ఫీచర్ వచ్చింది. సాధారణంగా స్నేహితులతో లేదా ఇష్టమైన వారితో చాటింగ్ చేసేప్పుడు టైపింగ్ కంటే ఎక్కువగా స్టిక్కర్లను వాడుతుంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒకరు చేసే విషయమే. కానీ, మీ ఫోటోలు లేదా వీడియోలను స్టిక్కర్లుగా మార్చి వాటిని పంపిస్తే ఎలా వుంటుంది. మీకు ఫ్రెండ్, మీకు ఇష్టమైన వారికీ ఇది చాలా సర్‌ప్రైజింగా వుంటుంది.
ఇందుకు ఎక్కువగా కష్టపడనక్కర్లేదు.. గూగుల్ ప్లే స్టోర్ నుండి Animated Sticker Maker WAStickerApps ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తరువాత మీకు యానిమేషన్ క్రియేషన్ అప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్ గ్యాలరీ నుండి మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియోను ఎంచుకొని సేవ్ చేయాలి.
తర్వాత వాట్సాప్ స్టిక్కర్స్ ఆప్షన్‌లో మీరు సేవ్ చేసిన వీడియో యొక్క వీడియో టూ యానిమేటెడ్ స్టిక్కర్స్ అప్షన్ కనిపిస్తుంది. ఇక మీకు కావాల్సిన వీడియోలు మరియు ఫోటోలను మీకు నచ్చినట్లుగా స్టికర్‌గా మార్చుకొని మీ స్నేహితులు మరియు ఇష్టమైన వారికీ లేదా ఇంకెవరికైనా సరే పంపించవచ్చు.