సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

ఇకపై వాట్సాప్ ద్వారా పేమెంట్స్... త్వరలోనే న్యూ ఫీచర్లు

సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల కోసం వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. 
 
వాస్తవానికి ఇప్పటికే ఈ ప్రాజెక్టును కొన్ని నెలల కిందటే ప్రారంభించారు. ఇపుడు దీన్ని మరింత అభివృద్ధి పరిచి త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఈ ప్రక్రియకు ముందే వాట్సాప్ ఆర్బీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది.
 
అంతేకాకుండా, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా మరో ఫీచర్ జోడిస్తున్నారు. గ్రూపులో చేరాల్సిందిగా అభ్యర్థన పంపేవారిని బ్లాక్ లిస్ట్ సాయంతో బ్లాక్ చేయొచ్చు. ఈ గ్రూప్ బ్లాక్ లిస్ట్ ఫీచర్‌ను మొదట ఐఫోన్ యూజర్లకు విడుదల చేస్తారు.
 
ముఖ్యంగా, ఒకేసారి అనేక డివైస్‌లలో లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే ఆవిష్కరించనుంది. ఇప్పటివరకు ఒక డివైస్‌లో వాట్సాప్ లాగిన్ అయివున్నప్పుడు మరో డివైస్‌లో లాగిన్ అయితే, ముందు లాగిన్ అయిన డివైస్‌లో వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది. 
 
ఇప్పుడు ప్రవేశపెడుతున్న సరికొత్త ఫీచర్ ద్వారా ఒకరు ఎన్ని డివైస్‌లలో అయినా వాట్సాప్‌ను యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. అంతేకాదు, ఐపాడ్‌లలోనూ వాట్సాప్ అందుబాటులోకి రానుంది.