Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ ద్వారా మరో కొత్త అప్‌డేట్‌.. మైక్‌ సింబల్‌ వచ్చేసింది..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 15 జులై 2022 (11:23 IST)
వాట్సాప్ ద్వారా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా స్టేటస్‌లో వీడియోలు, ఫొటోలు, టెక్ట్స్‌లను పోస్ట్‌ చేస్తుండడం తెలిసిందే. అయితే వాట్సాప్‌ ఇప్పుడు దీనికి కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొస్తోంది. 
 
అదే ఇకపై యూజర్లు తాము స్వయంగా రికార్డ్‌ చేసిన ఆడియోను నేరుగా స్టేటస్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్‌ కాస్ట్‌లకు విపరీతంగా క్రేజ్‌ పెరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. నచ్చిన ఫొటో లేదా వీడియోను పోస్ట్‌ చేసి దానిపై ఆడియో రూపంలో కామెంట్‌ చేయొచ్చు. 
 
ప్రస్తుతం వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌ను క్లిక్‌ చేయగానే కెమెరా, టెక్ట్స్‌ ఫీచర్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియో స్టేటస్‌ పోస్ట్‌ చేసేందుకు వీలుగా మైక్‌ సింబల్‌ కనిపిస్తుంది. 
 
దీంతో నేరుగా వాయిస్‌ రికార్డ్‌ చేసుకొని స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments