గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:11 IST)

వ్యాక్సిన్‌ వేయించుకునే వారికి తీపి కబురు.. వాట్సాప్ ద్వారా బుకింగ్

వ్యాక్సిన్‌ వేయించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వ్యాక్సినేషన్‌ బుకింగ్‌ విధానం లో నూతన సదుపాయాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 
 
ఇక అందరూ వాడేటు వంటి వాట్యాప్‌ లోనూ టీకా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్‌ నంబర్‌ 9013151515 కు బుక్‌ స్లాట్‌ అని మెసేజ్‌ పంపాలని.. కేంద్రం తెలిపింది.
 
ప్రజల సౌకర్యార్థం వాట్సాప్‌ లోనూ టీకా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు కేంద్ర మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ.. పౌరుల సేవ లో కొత్త శకానికి నాంది పలికామన్నారు.
 
తాజాగా విధానంతో టీకా స్లాట్లను ఫోన్‌ లోనే క్షణాల్లో బుక్‌ చేసుకోవచ్చని వివరించారు. ఈ విధానం కారణంగా మామూలు ప్రజలు సులభంగా వ్యాక్సిన్‌ తీసుకుంటారని తెలిపారు. ఇక ముందు ప్రజలందరూ వాట్సాప్‌ ద్వారానే టీకా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.