ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (11:24 IST)

వాట్సాప్ యూజర్లకు ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్‌!!

Whatsapp
ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికపుడు అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఆ కోవలోనే ఇపుడు మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇది ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చేసే ఫిర్యాదులు, సందేహాలపై సత్వరమే పరిష్కారం చూపించనుంది. ఈ మేరకు నూతన ఫీచర్‌పై వాట్సాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తుందని వాబెటా ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ల ఫిర్యాదులు, ప్రశ్నలకు తక్షణ స్పందన లభించనుందని తెలిపింది. 
 
అన్ని వెర్షన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, పని గంటల ఆవల కూడా యూజర్లకు ఏఐ ఫీచర్ పరిష్కారాలు లభించనున్నాయని వివరించింది. వేగంగా, సమయాన్ని ఆదా చేసే రీతిలో ప్రతిస్పందన ఉంటుందని వివరించింది. ఈ మేరకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుత పరీక్షిస్తోందని 'వాబెటా ఇన్ఫో' రిపోర్ట్ వెల్లడించింది. వాట్సాప్ కస్టమర్ సేవల సిబ్బంది అందుబాటులో లేని సమయంలో కూడా వినియోగదారులకు సకాలంలో అవసరమైన సాయం అందుతుందని తెలిపింది. అయితే ఏఐ ఫీచర్ ద్వారా అందిన సహాయం సంతృప్తికరంగా లేకపోతే యూజర్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో తమ సమస్యను విన్నవించుకోవచ్చని పేర్కొంది. కాగా వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకుపైగా యూజర్లు ఉన్న విషయం తెల్సిందే.