ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (13:03 IST)

వాట్సాప్ నుంచి కొత్తగా మూడు ఫీచర్లు

whatsapp
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మూడు ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పటికే వున్న పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేయగా, ఫార్వాడ్ చేసే ఫోటోలకు, షేర్ చేసే డాక్యుమెంట్లకు క్యాప్షన్ ఇవ్వవచ్చునని తెలిపింది. 
 
వాట్సాప్ పోల్స్ ఫీచర్‌‌లో క్రియేట్ సింగిల్ ఓట్ పోల్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ ఛాట్స్, పోల్ రిజల్ట్ అప్‌డేట్. అలాగే ఫోటో విత్ క్యాప్షన్ ద్వారా గతంలో ఇతరుల పంపిన లేదా గ్రూప్‌లో వచ్చిన ఫోటోలను మరొకరితో షేర్ చేసేటప్పుడు ఇమేజ్ మాత్రమే ఫార్వర్డ్ చేయగలుగుతాం. దాంతో పాటు వున్న టెక్ట్స్‌ను వేరేగా కాపీ చేసి పేస్ట్ చేయాల్సి వుంటుంది. 
 
కానీ ఫార్వాడింగ్ విత్ క్యాప్షన్స్ ఫీచర్‌తో ఇతరులు పంపిన ఫోటోతో పాటు దాని కింద వున్న క్యాప్షన్ కూడా ఫార్వార్డ్ అవుతుంది. అలాగే షేరింగ్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్స్‌తో యూజర్లు ఏదైనా డాక్యుమెంట్‌ను ఇతరులతో షేర్ చేసేటప్పుడు దాని గురించిన సమాచారం క్లుప్తంగా పంపవచ్చు.