గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (11:00 IST)

రెడ్మీ 6 ఫోను ధరను తగ్గించిన షియోమీ

మొబైల్ ఫోన్ల తయారీలో ఒకటైన షియోమీ తాజాగా ప్రవేశపెట్టిన మోడల్ రెడ్మీ 6. ఈ ఫోను ధరను భారత్‌లో మాత్రం తగ్గించింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోనుపై రూ.500 తగ్గించింది. ఫలితంగా ఈ రకం ఫోన్ ధర ఇపుడు రూ.7999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కూడా రూ.500 మేరకు తగ్గించింది. ఈ ఫోను ధర ఇపుడు రూ.8900గా నిర్ణయించింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌ల‌లో ఈ ఫోన్ ఇప్పుడు త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ 6 ఫోన్‌లో 5.45 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ సిమ్‌, డెడికేటెడ్ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.