శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (17:35 IST)

12 కోట్ల మంది ''టిక్ టాక్'' పేషెంట్లు.. షాకింగ్ రిపోర్ట్

భారత్‌లో 12 కోట్ల మంది టిక్ టాక్ పేషెంట్లు వున్నట్లు షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోయిందని.. టిక్ టాక్ అంటే ఎగబడే వారు అధికమవుతున్నారని తాజా రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది.


దేశంలో నటనతో తమ నైపుణ్యాన్ని వెలిబుచ్చి.. వీడియోలను టిక్ టాక్‌లో పోస్టు చేసి.. 12 కోట్ల మంది లైక్‌ల కోసం వేచి వుంటే.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు చాలామందికి కౌన్సిలింగ్ కోసం రంగం సిద్ధంగా వుందని టాక్. 
 
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు టిక్ టాక్‌ను ఉపయోగిస్కున్నారు. ఇందులో మనదేశంలో మాత్రం 30కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు అంచనా. ఇటీవల టిక్ టాక్ సంస్థ భారత్‌లో మాత్రం 12 కోట్ల మంది వీడియోలను పోస్టు చేసి లైకుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా 150 భాషల్లో, భారత్‌లో తెలుగు, తమిళం, హిందీలతో పాటు 11 భాషల్లో టిక్ టాక్ యాప్‌ అందుబాటులో వుంది. ముంబై, ఢిల్లీలో టిక్ టాక్ సంస్థకు చెందిన కార్యాలయాలున్నాయి. ఇందులో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాదిలో మాత్రం 60లక్షల వీడియోలను హింస, అశ్లీలత కారణంగా డిలిట్ చేసినట్లు టిక్ టాక్ వెల్లడించింది. 
 
అయితే ఈ టిక్ టాక్ ద్వారా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వీడియోలను పోస్టు చేసే అలవాటు ద్వారా టిక్ టాక్‌కు అడిక్ట్ అవుతున్నారని తేలింది. అందుకే టిక్ టాక్ సంస్థ 13 విధివిధానాలను అమలు చేసింది. ఈ విధుల్లో 13 ఏళ్లలోపు గల వారు టిక్ టాక్ యాప్‌ను ఉపయోగించలేరు. అయితే ఇప్పటికే టిక్ టాక్‌ను నిషేధించాలని తమిళనాడులో డిమాండ్ పెరిగిపోతూ వస్తోంది.