మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (16:54 IST)

స్మార్‌ఫోన్‌ బ్యాటరీ ఛార్జ్ ఎలా చేయాలి..?

ఇప్పుడూ ఎక్కడ చూసిన స్మార్ట్‌ఫోన్సే కనబడుతున్నాయి. ఈ కాలంలో మనుష్యుల సంఖ్య ఎంత వున్నదో తెలీదు కానీ స్మార్ట్‌ఫోన్స్ మాత్రం ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. మరి స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించాలంటే.. దానిలోని బ్యాటరీ బాగా పనిచేయాలి. అప్పుడే ఫోన్‌ వాడగలం. కనుక బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..
 
చాలామంది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సున్నాకు దగ్గరైనప్పుడు ఏదో జరిగినట్టు హడావుడిగా ఛార్జింగ్ పెడుతుంటారు. మళ్లీ ఏం చేస్తారంటే.. బ్యాటరీ ఛార్జ్ 10 శాతం చేరుకోగానే.. ఇకచాల్లే అని ఛార్జింజ్ తీసేస్తుంటారు. ఇలా చేయడం వలన బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడుతుందో అసలు ఆలోచించరు. పైగా అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా ఛార్జ్ వేసుకుంటూ ఉంటే బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుందని చెప్పలేం.
 
ఇటీవలే ఓ అధ్యయనంలో బ్యాటరీ యూనివర్సిటీ అనే కంపెనీ.. అసలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను ఎలా ఛార్జ్ చేసుకోవాలి.. అందుకు గల కారణాలేంటనేది వివరించారు.. పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత ఛార్జర్ నుండి ఫోన్‌ను కచ్చితంగా వేరుచేయాలి. వందశాతం ఛార్జింగ్ తరువాత సమయం గడుస్తున్న కొద్దీ ఛార్జ్ అవుతుండడం వలన బ్యాటరీకి నష్టం జరుగుతుంది.
 
బ్యాటరీని వందశాతం ఛార్జ్ చేయడం సరికాదని తెలిపింది. పదిశాతం ఛార్జ్ తగ్గిపోగానే మళ్లీ ప్లగ్ చేయడం మేలని దీనివలన బ్యాటరీ ఎక్కవ కాలం మన్నడమే కాకుండా.. ఛార్జ్ అయిపోతుందన్న బాధ కూడా ఉండదని వివరించింది.