గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 జూన్ 2016 (21:35 IST)

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
తాత్పర్యం: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.