ఆదివారం, 11 జనవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (10:53 IST)

కారణమైన కర్మములు.. అసాధ్యములుగాక..?

కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్నిగొందులం
దూరిన నెంతవారలకు దొల్లి పరీక్షితు శాపభీతుడై
వారధి నొప్పునుప్పరిగపై బదిలంబుగ దాగి యుండినం
గ్రూర భుజంగదంతహతి గూలడె లోకులెఱుంగ  భాస్కరా..
 
అర్థం: పూర్వము పరీక్షిత్తు అనే మహారాజు వేటకు వెళ్లి, ఆ అడవిలో వేటాడి అలసిపోయి, దప్పికగొని ఒక మునిని దాహానికి నీళ్లు ఇమ్మని అడిగెను. తపస్సున నేకాగ్రుడైన యా మునియు నీతని విచారింపడయ్యెను. అందులకు కోపించి ఆ రాజాముని మెడలో నొక చచ్చిన పామును వైచెను. అది చూచి మునిపుత్రుడు మా తండ్రి మెడలో పామును వైచినవాడేడు రోజులలో పాము గఱచి చచ్చుగాకని తిట్టెను. 
 
పరీక్షిన్మహారాజు ముని శాపముచే తనుకు కీడుకుల్గునని తలంచి సముద్రముంద మేడను నిర్మించేసి అందు దాగియుండినను, విధి విధానము యెవ్వవరిని నత్రిక్రమింప వీలుకాని దగుటచే నతడు తుదకు పాము కాటుచే మరణించెను. ఎంత గొప్ప వాడైనను దైవ విధానమునకు ప్రతి విధానముచేసి ఆ ఆపదలను తొలగించుకొందమన్నను, నవి అసాధ్యములుగాక, సాధ్యములగునా..?