గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (11:52 IST)

ఓపీఎస్ కుమారుడికి హారతి : టోకన్లు ఇచ్చి డబ్బు పంపిణీ

తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తనయుడు రవీంద్రనాథ్ తేని లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకుని తన పట్టును నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఓపీఎస్ ఉన్నారు. 
 
అదేసమయంలో ఎన్నికల ప్రచారానికి జనసమీకరణ చేయడం తలకుమించిన భారంగా మారింది. అలాగే ఎన్నికల ప్రచారానికి వచ్చే వారికి డబ్బుల పంపిణీ కూడా కష్టతరంగా మారింది. దీంతో సరికొత్తగా మరో విధానాన్ని కనిపెట్టారు తమిళ నేతలు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ప్రచారం చేస్తే ఓ రేటు, నేతలు వచ్చినప్పుడు వారికి హారతి పడితే మరో రేటు ఫిక్స్ చేశారు.  
 
 
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ ఎన్నికల ప్రచారంలో ఈ విధానాన్ని అమలు చేశారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. హారతి ఇచ్చేందుకు తీసుకొచ్చిన మహిళలకు రూ.200 చొప్పున ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. 
 
ఇందుకోసం ఎటువంటి పొరపాట్లు జరగకుండా హారతి ఇచ్చే మహిళలకు ముందుగానే టోకెన్ల వంటివి పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక.. ఆ టోకెన్లు, హారతి పళ్లాలు ఇచ్చి మహిళలు రూ.200 తీసుకోవడాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.