గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (17:24 IST)

ప్రియురాలి కోపాన్ని అలా చల్లార్చవచ్చు...?

మీ భాగస్వామి మంచి కోపం మీద ఉన్నారని బాధపడుతున్నారా.. కోపాన్ని కరిగించి, ప్రేమ జ్యోతిని వెలిగించడమెలా అన్న ఆలోచనలో ఉన్నారా.. ఇదిగో ఇక్కడ ఉంది మంచి చిట్కా.
 
భాగస్వామి మాటల్లోనే కోపం వెనుక కారణాన్ని శ్రద్ధగా వినండి. వారి కోణంలో నుంచి ఆలోచించి సముదాయించండి. అయినప్పటికీ ముక్కు మీద కోపం మాయం కాకపోతే... నెమ్మదిగా భాగస్వామిని అతిసన్నిహితంగా చేరుకోండి. 
 
భాగస్వామి విసురుగా పక్కకు తోసివేస్తే.. దూరంగా నిలబడి దీనంగా ముఖం పెట్టి భాగస్వామి వైపు రెప్పలార్చకుండా చూడాలి. కోపం చల్లారి మీపై కరుణ కలిగిందన్న సూచన కనిపించదంటే.. చుంబన మంత్రాన్ని మరోమారు వల్లెవేయండి. అందుకు బదులుగా మీ భాగస్వామి తిరుగు చుంబనం చెల్లించుకోకుంటే అప్పుడు అడగండి.