సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (17:39 IST)

ఆల్కహాల్ టెస్టులో విమానాశ్రయ ఉద్యోగులు ఫెయిల్.. సస్పెండ్ అయ్యారు..

విమానాశ్రయ ఉద్యోగులు, ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు ఆల్కహాల్ టెస్టును నిర్వహించారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఏరో బ్రిడ్జ్ ఆపరేటర్‌గా ఉన్న వ్యక్తి అక్టోబర్ 21న నిర్వహించిన టెస్టుల్లో విఫలం అవగా... ముంబై విమానాశ్రయంలోని సీనియర్ ఎయిర్‌పోర్ట్ ఎలక్ట్రీషియన్‌ కూడా టెస్టులో ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ టెస్టులో మొత్తంగా 13 మంది విఫలమయ్యారు. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 13 మంది ఉద్యోగులు బుక్ అయ్యారు. వీరిని మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. వేటుపడిన వారిలో ఏడుమంది ఇండిగో ఉద్యోగులు, గోఎయిర్‌ స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక్కో ఉద్యోగి ఉన్నట్లు ప్రకటించారు. 
 
బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా 13 మంది విఫలమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం వాలంటరీ ఫేజ్‌లోనే జరిగిన టెస్టులని నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఆల్కహాల్ టెస్టులో ఫెయిల్‌ అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ అధికారులు తెలిపారు.