సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (13:23 IST)

అహ్మదాబాద్ ఆస్పత్రిలో దారుణం : శిశువుల మరణ మృదంగం

మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో శిశు మరణాలు దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ ఘటన నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో శిశువులు వరుసబెట్టి చనిపోతున్నారు.

మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో శిశు మరణాలు దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ ఘటన నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో శిశువులు వరుసబెట్టి చనిపోతున్నారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో గత 36 గంటల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్ ఎన్నికల వేళ ఇలా జరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల్లో కలుపుకుంటే ఈ సంఖ్య 18కి చేరింది. 
 
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ పిల్లలు లూనావాడ, మాన్సా, విరామ్‌గావ్, హిమ్మత్‌నగర్, సురేందర్‌నగర్ ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో నలుగురు పిల్లలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారే అని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. 
 
ఈ మరణాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎం ప్రభాకర్ స్పందిస్తూ, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంక్యుబేటర్ల కారణంగా చనిపోలేదని తెలిపారు. అయితే ఆస్పత్రిలో వసతులపై వస్తున్న ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు శిశువుల మరణాలపై వైద్యవిద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆర్‌కే దీక్షిత్ ఆధ్వర్యంలో విచారణ బృందాన్ని గుజరాత్ సర్కార్ నియమించింది.