ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (15:05 IST)

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. మధురలో ఇద్దరు భక్తుల మృతి

Lord Krishna
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. యూపీలోని ప్రాశస్త్యమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని వారు చెప్పారు. 
 
జన్మాష్టమి పూజా సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం రద్దీతో నిండిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఆరుగురు కూడా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.