మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (13:54 IST)

మొహర్రం వేడుకలో అపశృతి - హై- వోల్టేజ్ వైర్ తాకి నలుగురు మృతి

Moharram
Moharram
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ముహర్రం ఊరేగింపుకు సిద్ధమవుతున్న సమయంలో హై ఓల్టేజ్ వైర్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇనుముతో చేసిన జెండా లైవ్ వైర్‌కు తగిలిందని.. దీంతో విద్యుదాఘాతంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని  బొకారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శి అలోక్ తెలిపారు. 
 
శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారు ముహర్రం ఊరేగింపు కోసం సిద్ధమవుతుండగా ఈ సంఘటన జరిగింది. 11,000 వోల్టేజ్ హై-టెన్షన్ విద్యుత్ తీగలో ఇనుముతో చేసిన ఇస్లాం జెండా తాకడంతో నలుగురు మృతి చెందారు.