ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (13:40 IST)

ఒకరినొకరు కాపాడేయత్నం... నీట మునిగి ఐదుగురు టీనేజర్లు మృతి

గుజరాత్ రాష్ట్రంలోని బోతాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నీట మునిగిన తమ స్నేహితుడిని రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు టీనేజర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడిన ఇద్దరు టీనేజర్లను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తూ ఈ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో మునిగేందుకు ఐదుగురు టీనేజర్లు వెళ్లారు. వారిలో ఇద్దరు తొలుత నీటిలో దిగి మునిగిపోతుండటంతో మరో ముగ్గురు వారిని రక్షించేందుకు నీటిలో దిగారు. వీరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 16 నుంచి 17 యేళ్ల వారేనని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ కిషోర్ బలోలియా మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ వారు కూడా మరణించారని ఆయన వివరించారు.