మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (08:01 IST)

కరోనా టీకా ఉత్పత్తి సిబ్బందికి కరోనా...

దేశ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా టీకాలను తయారు చేస్తున్నారు. ఈ టీకాలను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీకి చెందిన సిబ్బందిలో 50 మందికి కరోనా వైరస్ సోకింది. 
 
ముఖ్యంగా ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే 'కొవాగ్జిన్' టీకాను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
 
టీకా విషయంలో రాజకీయ ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నాయంటూ సుచిత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కృషిని పట్టించుకోకుండా చేస్తున్న ఆరోపణలు తమను బాధిస్తున్నాయన్నారు.
 
తమ సిబ్బందిలో 50 మంది కరోనా బారిన పడి విధులకు దూరంగా ఉన్నారని, అయినప్పటికీ టీకాల తయారీ కోసం శ్రమిస్తూనే ఉన్నామన్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలోనూ రోజంతా టీకాల ఉత్పత్తి కొనసాగుతోందని అన్నారు. కాగా, సుచిత్ర చేసిన ఈ ట్వీట్‌కు యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీ సిబ్బందికి టీకా వేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు.