బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (11:04 IST)

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

fire accident
ముంబైలో ఏడంతస్థుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. 
 
భవనం వద్ద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవనం పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. 
 
ఓ బట్టముక్కకు మంటలు అంటుకుని ఆ తర్వాత ఆ ప్రాంతమంతా విస్తరించినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.