శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (10:53 IST)

పిండ అవశేషాల కలకలంపై విచారణకు ఆదేశం

Fetuses
కర్నాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లాలో ఏడు పిండ అవశేషాలను కనుగొన్నారు. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్ణ శివార్లలో ఓ బస్టాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని డబ్బాలను వదిలి వెళ్లారు. వీటిని గుర్తించిన స్థానికులు వాటిలో ఏముందోనని తెరిచి చూడగా, పిండ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు వచ్చిన పిండ అవశేషాలున్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ పిండ అవశేషాలను భ్రూణహత్యులగా పేర్కొంటున్నారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలలు నిండిన శిశువుల పిండాలు అని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించింది. పైగా, ఈ పిండ అవశేషాలను భద్రంగా దాచిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.