ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (09:49 IST)

బెలగావి జిల్లాలో ఏడు పిండాల అవశేషాలు.. భ్రూణ హత్యలు

కర్ణాటకలో బెలగావి జిల్లాలో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. జిల్లాలోని ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలిపెట్టి వెళ్లారని.. స్థానికుల సమాచారంతో పోలీసులు వాటిని ఏడు పిండాల అవశేషాలుగా గుర్తించారు.
 
వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు. 
 
కాగా, ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ పిండాలని దవాఖానలో భద్రపరిచామని అధికారులు వెల్లడించారు. వాటిని పరీక్షల నిమిత్తం జిల్లా ఫంక్షనల్‌ సైన్స్‌ సెంటర్‌కు పంపిస్తామన్నారు