గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (17:29 IST)

తరగతి గదిలో స్టూడెంట్స్ రొమాన్స్.. ఏడుగురు సస్పెండ్

romance
తరగదిలోనే సహచర విద్యార్థులతో కొందరు విద్యార్థులు రొమాన్స్ చేశారు. దీంతో ఏడుగురు విద్యార్థులను కాలేజీ యజమానులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... సిల్చార్‍లోని రామానుజ్ గుప్తా కాలేజీలో విద్యార్థినీ విద్యార్థులు తరగతి గదిలోనే రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో రొమాన్స్ గుట్టు బయటకు వచ్చింది. కాలేజీ భోజన విరామ సమయంలో కొందరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తరగతి గదిలో నలుగురు అమ్మాయిలతో ముగ్గురు అబ్బాయిలు కలిసి రొమాన్స్ చేశారు. దీనిపై కన్నెర్రజేసిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ ఏడుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.