శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (08:40 IST)

యువతి తలలో 70 సూదులు.. పుర్రెలోకి దిగలేదు.. ప్రాణాపాయం తప్పింది..

Needles
Needles
ఆధునిక కాలంలో మూఢనమ్మకాలను అనుసరించే వారి సంఖ్య తగ్గట్లేదు. ఒడిశాలో ఓ మాంత్రికుడు యువతి తలలో 70 సూదులు దించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అనారోగ్యంతో వున్న యువతికి చికిత్స చేస్తానని.. యువతి తలలో 70 సూదులు దింపాడు. ఆ సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా (19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో, ఆమె తండ్రి బిష్ణు బెహారా.. తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. 
 
వైద్యం పేరిట తేజ్‌రాజ్ పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. అయినా తలనొప్పి తగ్గలేదు. శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. 
 
దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను అరెస్టు చేశారు.