శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (11:38 IST)

ఐస్‌క్రీమ్ ఆరగించి ఆస్పత్రి పాలైన 70 మంది.. ఎక్కడ?

ఒడిశా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఐస్‌క్రీమ్ ఆరగించిన 70 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యాపారి బండి ఐస్ క్రీమ్ విక్రయించాడు. దీన్ని పిల్లలు పెద్దలు కొనుగోలు చేసి ఆరగించారు. సరిగ్గా రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయానికి ఐస్ క్రీమ్ తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. 
 
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందులుపడ్డారు. దీంతో వారందరినీ అప్పటికపుడు దమన్ జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్‌పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 60 మంది కోలుకోగా, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది.